tejaswi madivada: అందుకే సినీ పరిశ్రమలో సక్సెస్ కాలేకపోయాను: సినీ నటి తేజస్వి
- టాలీవుడ్ లో 90 శాతం కాస్టింగ్ కౌచ్ ఉంది
- నాకు తెలిసిన చాలా మంది హీరోయిన్లకు చేదు అనుభవాలు ఉన్నాయి
- కమిట్ మెంట్ కు ఓకే అంటే చాలా అవకాశాలు వస్తాయి
సినీ పరిశ్రమలో ఉండే కాస్టింగ్ కౌచ్ గురించి ఇప్పటికే ఎంతో మంది గళమెత్తారు. తమకు ఎదురైన చేదు అనుభవాలను నిర్భీతిగా బయటపెట్టారు. ఈ క్రమంలో ఎంతో మంది సినీ పెద్దల భాగోతం బట్టబయలైంది. తాజాగా కాస్టింగ్ కౌచ్ పై తెలుగు సినీ నటి తేజస్వి కూడా షాక్ కు గురి చేసే నిజాలను బయటపెట్టింది.
టాలీవుడ్ లో 90 శాతం కాస్టింగ్ కౌచ్ ఉందని తేజస్వి స్పష్టం చేసింది. కమిట్ మెంట్ కు ఓకే చెపితేనే అవకాశాలు వస్తాయని చెప్పింది. ఈ క్యాటగిరీలో ఉండేవాళ్లే ఇండస్ట్రీలో ముందుకు సాగుతారని చెప్పింది. ఇండస్ట్రీకి వస్తున్న వారు ముందుగానే దీనికి ప్రిపేరై వస్తున్నారని తెలిపింది. తనను కూడా చాలా మంది పడక గదికి రమ్మని పిలిచారని... దానికి తాను ఒప్పుకోకపోవడం వల్లే, సినీ పరిశ్రమలో సక్సెస్ కాలేకపోయానని చెప్పింది.
తనకు తెలిసిన హీరోయిన్లలో చాలా మందికి ఇలాంటి చేదు అనుభవాలే ఉన్నాయని తేజస్వి తెలిపింది. చాలా మంది తమ అనుభవాలను బయటకు చెప్పుకోరని వ్యాఖ్యానించింది. ముంబై నుంచి వచ్చే అమ్మాయిలు దేనికైనా ఒప్పుకుంటారని... ఈ ఒక్క కారణం వల్లే వారికి అవకాశాలు ఇస్తుంటారని చెప్పింది. ముంబై అమ్మాయిలు కమిట్ మెంట్లకు సిద్ధపడి ఇక్కడకు వస్తారని సంచలన వ్యాఖ్యలు చేసింది. కమిట్ మెంట్ కు రెడీ అంటే అవకాశాలు ఇచ్చే వాళ్లు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారని చెప్పింది. తేజస్వి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనం రేపుతున్నాయి.