Wasim Akram: స్వింగ్ లేకుండా బౌలింగ్ చేయాల్సి వస్తుంది: వసీం అక్రమ్
- బంతికి లాలాజలం ఉపయోగిచడంపై తాత్కాలిక నిషేధం
- బౌలర్లు రోబోలుగా మారిపోతారన్న వసీం అక్రమ్
- వాజెలిన్ వాడితే ఉపయోగం వుంటుందన్న మాజీ పేసర్
కరోనా నేపథ్యంలో బంతిపై బౌలర్లు లాలాజలాన్ని ఉపయోగించడాన్ని ఐసీసీ తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ మాజీ పేసర్ వసీం అక్రమ్ స్పందిస్తూ, ఈ చర్య వల్ల బౌలర్లు రోబోలుగా మారతారని చెప్పారు. స్వింగ్ లేకుండా బౌలింగ్ చేయాల్సి వస్తుందని తెలిపారు. బంతి షైనింగ్ కోసం, స్వింగ్ కోసం లాలాజలాన్ని ఉపయోగిస్తూ తాను పెరిగానని... ఇప్పుడు ఇది తనకొక విచిత్రమైన పరిస్థితి అని చెప్పారు.
అయితే ప్రత్యామ్నాయంగా వాజెలిన్ వంటి పదార్థాలను ఉపయోగిస్తే బాగుంటుందని సూచించారు. ఏం జరుగుతుందో చూడాలని చెప్పారు. లాలాజలం వల్ల కరోనా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉండటంతో... బంతికి లాలాజలం పూయడంపై ఐసీసీ తాత్కాలిక నిషేధాన్ని విధించింది. ఈ నేపథ్యంలో బౌలర్ల పరిస్థితి ఏమిటనే దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.