Balakrishna: ప్రతిసారి నా కోసం మీరొస్తారు.. ఈ సారి మీ కోసం నేనొస్తున్నాను.. ఎఫ్‌బీలో నాతో మాట్లాడండి: బాలయ్య

balakrishna birthday ceremony

  • ఈ రోజు సాయంత్రం 4.30 గంటలకు ఫేస్‌బుక్ ‌లైవ్‌లోకి బాలయ్య
  • ఫేస్‌బుక్‌ ద్వారా తెలిపిన బాలకృష్ణ
  • అభిమానులు అడిగే  ప్రశ్నలకు బాలకృష్ణ సమాధానాలు

తన 60వ పుట్టినరోజు వేడుకను జరుపుకుంటోన్న సినీనటుడు బాలకృష్ణ  ఈ రోజు సాయంత్రం 4.30 గంటలకు ఫేస్‌బుక్ ‌లైవ్‌లోకి తన అభిమానులతో ముచ్చటించబోతున్నారు. కరోనా నేపథ్యంలో ఆయన ఘనంగా అందరితో కలిసి పుట్టినరోజు వేడుకను జరుపుకోలేకపోతోన్న విషయం తెలిసిందే.  ప్రతి సంవత్సరం అభిమానులు తన కోసం వస్తారని, ఈ సారి మాత్రం తానే వస్తున్నానని బాలకృష్ణ చెప్పారు. అభిమానులు అడిగే ప్రశ్నలకు బాలకృష్ణ సమాధానాలు ఇస్తారు.

'సుదూరతీరాలనుంచి ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ఎంతో అభిమానంతో నాకు ప్రత్యక్షంగా శుభాకాంక్షలు తెలపాలని ప్రతి ఏడాది నన్ను కలవడం మీకు ఆనవాయితీ. ఈ సంవత్సరం కరోనా మహమ్మారి కారణంగా మిమ్మల్ని భౌతికంగా కలవలేకున్నా మిమ్మల్ని ఆనందపరచడానికి ఫేస్‌బుక్‌లో మీతో సంభాషించాలనుకుంటున్నాను' అని బాలయ్య తన ఫేస్‌బుక్ ఖాతాలో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News