Fahd Hussain: కరోనాపై పోరులో ఉత్తరప్రదేశ్ ను ప్రశంసించిన పాకిస్థాన్ మీడియా

Pakistan media person praises Uttar Pradesh anti corona measures

  • పాకిస్థాన్ కంటే యూపీ మెరుగ్గా ఉందన్న డాన్ రెసిడెంట్ ఎడిటర్
  • యూపీలో తక్కువ మరణాలు నమోదయ్యాయని వెల్లడి
  • పాజిటివ్ కేసులూ తక్కువేనన్న ఎడిటర్

పాకిస్థాన్ లో డాన్ అనేది ఎంతో ప్రజాదరణ ఉన్న పత్రిక. డాన్ లో ప్రచురితమయ్యే వార్తలకు ఎంతో విశ్వసనీయత ఉంటుందని అక్కడివారు భావిస్తారు. తాజాగా డాన్ పత్రిక ఇస్లామాబాద్ ఎడిషన్ రెసిడెంట్ ఎడిటర్ ఫహాద్ హుస్సేన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కరోనాపై పోరులో పాకిస్థాన్ కంటే భారత్ లోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఎంతో మెరుగ్గా వ్యవహరిస్తోందని ప్రశంసాపూర్వక వ్యాఖ్యలే చేశారు. పాకిస్థాన్ తో పోల్చితే యూపీలో తక్కువ సంఖ్యలో మరణాలు నమోదయ్యాయని, ఈ నేపథ్యంలో యూపీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో తప్పకుండా తెలుసుకోవాలని హితవు పలికారు.

అంతేకాదు, తన వ్యాఖ్యలు నిజమే అనిపించేలా ఫహాద్ హుస్సేన్ గణాంకాలు కూడా వెల్లడించారు. దీని ప్రకారం పాకిస్థాన్ జనాభా 208 మిలియన్లు కాగా, ఉత్తరప్రదేశ్ జనాభా 225 మిలియన్లు అని, అయినప్పటికీ కరోనా కేసుల విషయంలో ఎంతో ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు. ఉత్తరప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10,619 కాగా, పాకిస్థాన్ లో పాజిటివ్ కేసుల సంఖ్య 98,943గా పేర్కొన్నారు. మరణాల విషయంలోనూ యూపీ మెరుగ్గా ఉందని, అక్కడ 275 మంది చనిపోతే, పాకిస్థాన్ లో ఇప్పటివరకు 2002 మంది మృతి చెందినట్టు వివరించారు.

  • Loading...

More Telugu News