India: మార్చి 2 స్టార్ట్... సెప్టెంబర్ 15 ఎండ్... కరోనా అంతం మొదలయ్యే తేదీ అదేనట!
- పరుగులు పెడుతున్న కేసుల సంఖ్య
- బెయిలీ మ్యాథమెటికల్ మోడల్ తో అంచనా
- వివరాలు ప్రచురించిన ఆన్ లైన్ జర్నల్
ఇండియాలో కరోనా సంక్షోభం మార్చి 2న ప్రారంభమైంది. ఇప్పటికే కేసుల సంఖ్య రెండు లక్షలను దాటి పరుగులు పెడుతోంది. ఈ మహమ్మారి ఎప్పుడు అంతమవుతుందన్న విషయమై డీజీహెచ్ఎస్ కు చెందిన డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అనిల్ కుమార్, డిప్యూటీ అసిస్టెంట్ డైరెక్టర్ రూపాలీ రాయ్, ఓ మ్యాథమేటికల్ మోడల్ సాయంతో అంచనాలు వేశారు. ఈ వివరాలు 'ఎపిడెమియోలజీ ఇంటర్నేషనల్' అనే ఆన్ లైన్ జర్నల్ లో ప్రచురితం అయ్యాయి.
బెయిలీ మ్యాథమెటికల్ మోడల్ ఆధారంగా తయారు చేసిన ఈ అంచనాల ప్రకారం, సెప్టెంబర్ 15 నాటికి ఇండియాలో సంక్షోభం సమసిపోయే స్థితి వస్తుంది. కరోనా వలన మరణించిన మరియు కరోనానుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య.. కొత్తగా నమోదవుతున్న కేసులతో సమానమైనప్పుడు, కరోనా అంతం మొదలైనట్టని అనిల్ కుమార్, రూపాలీ వెల్లడించారు. ఇదే సమయంలో ఇండియాలో వాతావరణ మార్పులు, జనాభా కరోనాను ప్రభావితం చేయకుండా ఉండాల్సి వుంటుందని వారు అభిప్రాయపడ్డారు.