Sruthi Hasan: మూడేళ్లుగా మానసిక సమస్యలు... చికిత్స తీసుకుంటున్నా: హీరోయిన్ శ్రుతీ హాసన్

Sruthi Hasan Having Mental Trouble from 3 Years
  • వ్యక్తిగత కారణాలతోనే నటనకు దూరం
  • కరోనా కారణంగా ప్రపంచమే ఆగిపోయింది
  • వెబ్ సైట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రుతీహాసన్
ఏ విషయాన్ని అయినా ఉన్నది ఉన్నట్టు చెప్పేసే హీరోయిన్ శ్రుతీ హాసన్, లాక్ డౌన్ సమయంలో ఓ వెబ్ సైట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలను వెల్లడించింది. వ్యక్తిగత కారణాలతోనే ఇటీవలి కాలంలో నటనకు దూరంగా ఉన్నానని చెప్పిన ఆమె, గత మూడేళ్లుగా తాను మానసిక సమస్యలతో బాధపడుతూ ఉన్నానని వెల్లడించింది. తన సమస్యలకు చికిత్సను కూడా పొందుతున్నానని చెప్పింది. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచమంతా ఇప్పుడు లాక్ డౌన్ తో ఆగిపోయిందని, ఇది ప్రకృతికి విరుద్ధమైన పరిస్థితని అభివర్ణించింది. ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పింది.

ఇక తనకు మానసిక సమస్యలు ఉన్నాయని చెప్పడానికి ఏ మాత్రమూ బాధ పడటం లేదని, ధ్యానం, యోగా, వ్యాయామం క్రమం తప్పకుండా చేస్తున్నానని శ్రుతీ హాసన్ తెలిపింది. పుస్తకాలను చదవడం, రాయడం, సంగీతం వినడం వంటివి కూడా చేస్తున్నానని చెప్పింది.
Sruthi Hasan
Lockdown
Interview

More Telugu News