Chandrakantha Goyal: కేంద్రమంత్రి పియూష్ గోయల్ కు మాతృవియోగం

Mother of Piyush Goyal died

  • శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచిన చంద్రకాంత గోయల్
  • తన తల్లి వృద్ధాప్య కారణాలతో మరణించిందన్న పియూష్ గోయల్
  • తన జీవితాన్ని ప్రజాసేవకు అంకితమిచ్చిందని వెల్లడి

రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ తల్లి చంద్రకాంత గోయల్ కన్నుమూశారు. శుక్రవారం రాత్రి ఆమె ముంబయిలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని పియూష్ గోయల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తన మాతృమూర్తి వృద్ధాప్య కారణాలతో మరణించినట్టు వెల్లడించారు. ఆమె తన యావత్ జీవితాన్ని ప్రజాసేవకు అంకితమిచ్చిందని తెలిపారు.
 
అప్పట్లో దేశంలో ఎమర్జెన్సీ అనంతరం చంద్రకాంత గోయల్ ముంబయిలో కార్పొరేటర్ గా ప్రస్థానం ఆరంభించారు. ఆపై ముంబయిలోని మాతుంగ అసెంబ్లీ స్థానం నుంచి మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాగా, చంద్రకాంత గోయల్ భర్త దివంగత వేద్ ప్రకాశ్ గోయల్ సుదీర్ఘకాలం బీజేపీ జాతీయ కోశాధికారిగా వ్యవహరించారు. ఆయన వాజ్ పేయి సర్కారులో షిప్పింగ్ మంత్రిగా పనిచేశారు.

Chandrakantha Goyal
Piyush Goyal
Death
Mumbai
BJP
  • Loading...

More Telugu News