Udayabhanu: కష్టాల్లో ఉన్నారని తెలిస్తే చాలు ఆలోచించకుండా వచ్చేస్తారు మా బాలయ్య: యాంకర్ ఉదయభాను
![Anchor Udayabhanu wishes Balakrishna](https://imgd.ap7am.com/thumbnail/cr-tn-c7a1f4927e67.jpg)
- జూన్ 10న బాలయ్య పుట్టినరోజు
- ముందుగానే మొదలైన సంబరాలు
- ట్వీట్ చేసిన ఉదయభాను
జూన్ 10న నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియాలో ముందుగానే సంబరాలు మొదలయ్యాయి. బాలయ్యకు ముందస్తుగా అనేకమంది విషెస్ తెలియజేస్తున్నారు. ప్రముఖ యాంకర్ ఉదయభాను కూడా బాలకృష్ణ పుట్టినరోజుపై ట్వీట్ చేశారు.. కష్టం ఉందని తెలిస్తే చాలు వెంటనే స్పందిస్తారని, ఎంత పని ఉన్నా పక్కనబెట్టి ఏమీ ఆలోచించకుండా వచ్చేస్తారు మా బాలయ్య అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాదు, 60 ఇయర్స్ బాలయ్య అంటూ ఓ ఫొటోను కూడా షేర్ చేశారు.
![](https://img.ap7am.com/froala-uploads/froala-4f8d91e38c91bc0ec76d8f333474e78fca7f5a1a.jpeg)