Godavari: కొన్ని తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ అభ్యంతరం వ్యక్తం చేసింది: గోదావరి బోర్డు చైర్మన్

Godavari board meeting held at Jalsoudha

  • ముగిసిన గోదావరి బోర్డు సమావేశం
  • సమావేశం స్నేహపూర్వకంగా జరిగిందన్న బోర్డు చైర్మన్
  • డీపీఆర్ లు ఇచ్చేందుకు రెండు రాష్ట్రాలు అంగీకరించినట్టు వెల్లడి

తెలుగు రాష్ట్రాల మధ్య జల విభేదాలను తీర్చేందుకు ఆయా నదీ యాజమాన్య బోర్డులు రంగంలోకి దిగాయి. నిన్న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అధికారులతో భేటీ అవగా, నేడు గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం నిర్వహించింది. కొద్దిసేపటి క్రితమే ఈ సమావేశం ముగిసింది. దీనిపై గోదావరి బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ మాట్లాడుతూ, ఈ భేటీ పూర్తిగా సుహృద్భావపూరిత వాతావరణంలో జరిగిందని అన్నారు. అయితే, కొన్ని తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ అభ్యంతరం వ్యక్తం చేసిందని, ఏపీ అభ్యంతరాలకు సమాధానం ఇవ్వాలని తెలంగాణకు సూచించామని తెలిపారు.

ఇప్పటివరకు సమర్పించిన డీపీఆర్ లపై చర్చించామని, గోదావరి నదిపై కొత్త ప్రాజెక్టుల డీపీఆర్ లు సమర్పించడానికి రెండు రాష్ట్రాలు అంగీకరించాయని తెలిపారు. జూన్ 10 లోగా సమర్పించాల్సి ఉంటుందని వివరించారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశం అజెండా అంశాలను కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖకు పంపించాలని ఏపీ, తెలంగాణ అధికారులకు సూచించారు. అంతేకాకుండా, గోదావరి నదిపై టెలిమెట్రీ ఏర్పాటు చేసేందుకు రెండు రాష్ట్రాలతో చర్చించామని, టెలిమెట్రీ ఎక్కడ ఏర్పాటు చేయాలనేదానిపై కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News