Pune: ఇకపై వీడియో కాల్ ద్వారానే ఫిర్యాదుల స్వీకరణ!: పూణే పోలీస్ కమిషనర్
- సడలింపులు పెరుగుతుంటే నేరాల పెరుగుదల
- ఫిర్యాదుల కోసం వర్చువల్ సిస్టమ్
- ప్రవేశపెట్టిన పూణే పోలీసులు
లాక్ డౌన్ సడలింపులను పెంచుతున్న కొద్దీ నేరాల సంఖ్య పెరుగుతూ ఉండటం, ఇదే సమయంలో ప్రజలు బయటకు వచ్చేందుకు భయపడుతున్న వేళ, ఫిర్యాదులు స్వీకరించేందుకు పూణే పోలీసులు వినూత్న మార్గాన్ని ప్రారంభించారు. ఇంటిలో నుంచి వీడియో కాల్ చేస్తే, ఫిర్యాదును స్వీకరించేలా కొత్త నిర్ణయాన్ని తీసుకున్నారు.
ఈ విషయాన్ని వెల్లడించిన పూణే పోలీస్ కమిషనర్ కె.వెంకటేశం, కేసుల స్వీకరణతో పాటు, కరోనానూ నియంత్రించేందుకు తమ నిర్ణయం సహకరిస్తుందని అభిప్రాయపడ్డారు. తొలి దశలో పూణే కమిషనరేట్ లో ఈ వర్చువల్ సిస్టమ్ ను అందుబాటులోకి తెచ్చామని, ఆపై దశల వారీగా మిగతా స్టేషన్లలో ప్రవేశపెడతామని తెలిపారు.