Rashmika Mandanna: ఐదేళ్ల వయసులోనే మ్యాగజైన్ కవర్ పేజీపై రష్మిక... ఇప్పుడు తెగ వైరల్!

Rashmika on Magazine Cover page on 5 years old
  • 2001లోనే ఫొటో షూట్
  • 'గోకులం' కవర్ పేజీపై చిత్రం
  • అపురూపంగా దాచిన రష్మిక తల్లి
ఒక మ్యాగజైన్ కవర్ పేజీపైకి ఎక్కాలంటే ఎంత కష్టమో సినీ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికీ తెలిసిందే. హీరోయిన్ అయితే, అందాల ఆరబోతలో ముందుండాలి. అటువంటిది ఇప్పుడు టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఉన్న రష్మిక, తన ఐదేళ్ల వయసులోనే ఓ మేగజైన్ కవర్ పేజీపైకి ఎక్కింది. తాజాగా రష్మికే స్వయంగా ఈ చిత్రాన్ని అభిమానులతో పంచుకోవడంతో అది తెగ వైరల్ అవుతోంది.

2001లో 'గోకులం' అనే పత్రిక కోసం రష్మిక ఫొటో షూట్ చేయగా, కవర్ పేజీపై ఆమె చిత్రం ముద్రితమైంది. దీన్ని ఎంతో అపురూపంగా రష్మిక తల్లి దాచిపెట్టిందట. ఇక ఇదొక్కటే కాదు, ఎప్పుడు ఎక్కడ తన చిత్రం కవర్ పేజీపై వచ్చినా, దాన్ని తల్లి దాస్తూ ఉంటుందని రష్మిక చెప్పింది. ఇక అప్పటి తన ఫొటోకు, ఇప్పుడు అదే పోజులో ఉన్న తాజా చిత్రాన్ని జోడిస్తూ ఇన్ స్టాగ్రామ్ లో ఆమె పోస్ట్ చేసింది. 
Rashmika Mandanna
cover Page
Gokulam

More Telugu News