: 'గ్రామీణులు అవినీతికి వ్యతిరేకంగా ఆలోచించడమే లేదు'
బలమైన లోకాయుక్త వ్యవస్థను ఏర్పాటు చేసినప్పుడే ప్రజలకు న్యాయం చేకూరుతుందని విశ్రాంత లోకాయుక్త జస్టిస్ రామనూజం అన్నారు. జనచైతన్య వేదిక నిర్వహించిన చర్చాగోష్టిలో మాట్లాడిన ఆయన, మనరాష్ట్రం కంటే కర్ణాటకలో లోకాయుక్త కాస్త బలంగా ఉందని తెలిపారు. మైనింగ్ వ్యవహారంలో అధికారులను బీజేపీ సస్పెండ్ చేయలేక పోయిందన్నారు. ప్రస్తుతం ఉన్న లోకాయుక్తతో ప్రజలకు ఏ విధమైన ఉపయోగమూ లేదని, దీన్ని మరింత బలోపేతం చేస్తే అధికారులు బాధ్యతగా ఉంటారని అభిప్రాయపడ్డారు. అవినీతిపై అన్నాహజారే ఉద్యమం కూడా పడిపోయిన కెరటమైందని ఆవేదన వ్యక్తం చేసారు. అవినీతి ఉద్యమాల్లో ప్రజలు మమేకం కావడం లేదని ఆక్షేపించారు. గ్రామీణులు అవినీతికి వ్యతిరేకంగా ఆలోచించడమే లేదన్నారు.