Chinmayi: జూ.ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌-మీరా చోప్రా వివాదం: ఎంటరైన చిన్మయి.. హీరోయిన్‌కి మద్దతు

chinmayi on meera tweets

  • తిడుతున్నవారి స్క్రీన్ షాట్స్ పోస్ట్ చేయమన్న చిన్మయి
  • పోస్టు చేస్తోన్న మీరా
  • భయపడి ఖాతాలు డిలీట్ చేసుకుంటున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్

టాలీవుడ్‌ హీరో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తనను సామాజిక మాధ్యమాల్లో వేధిస్తున్నారని నటి మీరా చోప్రా ఆవేదన వ్యక్తం చేసిన అంశంపై గాయని చిన్మయి స్పందించింది.  వెంటనే పోలీసు కేసు ఫైల్ చేయమని ట్వీట్ చేసింది. అయితే, ఒకరిమీద అయితే ఇవ్వచ్చని, వేలల్లో  మెసేజ్ లు వస్తున్నాయని మీరా చెప్పింది. కాగా, ఇప్పటికే ట్విట్టర్‌లో సైబర్ పోలీసులకు మీరా ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా ఆమెకు చిన్మయి ఓ సూచన చేసింది. 'తిడుతున్నవారి స్క్రీన్ షాట్స్ పోస్ట్ చెయ్. అనంతరం వారిపై లాయర్ సాయంతో పోలీస్ కేసు ఫైల్ చెయ్.  నేను మద్దతిస్తాను' అని చిన్మయి సూచించింది. దీంతో మీరా పలువురి పోస్టుల స్క్రీన్ షాట్స్ ను షేర్ చేస్తోంది. దీంతో భయపడుతోన్న కొందరు నెటిజన్లు వెంటనే తమ ఖాతాలను డిలీట్‌ చేసుకుంటుండడం విశేషం.

Chinmayi
Twitter
meera chopra
Junior NTR
  • Loading...

More Telugu News