Maniratnam: నాటి సూపర్ హిట్ లవ్ స్టోరీ సీక్వెల్ లో దుల్ఖర్!

Dulkhar to play hero in Roja sequel

  • వైవిధ్యమైన ప్రేమకథగా 'రోజా'కు ఆదరణ
  • హీరోగా వెలుగులోకి వచ్చిన అరవింద్ స్వామి  
  • సంగీత దర్శకుడిగా దూసుకువచ్చిన రెహ్మాన్  
  • 'పొన్నియన్ సెల్వన్' తర్వాత సెట్స్ పైకి  

1992లో వచ్చిన 'రోజా' సినిమా ఓ సంచలనం!
వెండితెర ప్రేమకథల్లో వైవిధ్యాన్ని ఆవిష్కరించిన చిత్రం అది. ఆ చిత్రం ద్వారానే హీరోగా అరవింద్ స్వామి వెలుగులోకి వచ్చారు. సంగీత దర్శకుడిగా రెహ్మాన్ ఒక్కసారిగా దూసుకొచ్చాడు. మణిరత్నం దర్శకత్వ ప్రతిభను ఎక్కడికో తీసుకుపోయిన సినిమా 'రోజా'.

ఆ చిత్రానికి సీక్వెల్ రానుందంటూ గత కొన్నేళ్లుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడీ వార్త నిజమయ్యే రోజు త్వరలోనే రానుంది. దర్శకుడు మణిరత్నం ఈ చిత్రం సీక్వెల్ ను చేయాలని నిర్ణయించుకుని, ఆ విధంగా స్క్రిప్టు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తాను చేస్తున్న'పొన్నియన్ సెల్వన్' చిత్రం పూర్తవగానే 'రోజూ 2'ని సెట్స్ కి తీసుకువెళతారని అంటున్నారు.

ఇక ఇందులో హీరోగా మలయాళ యంగ్ హీరో దుల్ఖర్ సల్మాన్ ని ఎంచుకున్నట్టు సమాచారం. నాటి 'రోజా' హీరో అరవింద్ స్వామి అందానికి తగ్గా అందగాడు నేటి హీరోల్లో దుల్ఖర్ ఒక్కడే అన్నది మణిరత్నం భావన కావచ్చు. అందుకే, అతనిని ఎంచుకున్నట్టు మనం భావించవచ్చు!

  • Error fetching data: Network response was not ok

More Telugu News