: మీడియాకు బొత్స క్లాస్
పార్టీ శ్రేణులను సన్నద్దం చేసేందుకు హైదరాబాద్ యూసఫ్ గూడ కోట్ల విజయభాస్కరరెడ్డి స్టేడియంలో నిర్వహిస్తున్న విస్తృత స్థాయి సమావేశం ఏర్పాట్లు పర్యవేక్షించిన బొత్స ఆ వివరాలు తెలిపేందుకు మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా టీకాంగ్ ఎంపీలు కేవలం కేసీఆర్ ఇంటికి భోజనానికి వెళ్ళారని, పెడర్ధాలు తీయొద్దని మీడియాతో చెప్పిన బొత్స, కళంకిత మంత్రులపై సమాధానం చెప్పాలంటూ కోరగానే, 'మీరు న్యాయమూర్తులు కాదు, దర్యాప్తు సంస్థలు కాదు, కనుక కళంకిత మంత్రులని అనకండి' అంటూ క్లాస్ పీకారు.
పనిలో పనిగా వైఎస్సార్ సీపీ నేతలు దొంగలు, అవినీతి పరులు అంటూ దుయ్యబట్టారు. స్వలాభాల కోసం పార్టీ పెట్టారు అంటూ విరుచుకుపడ్డారు. దీంతో కొందరు జర్నలిస్టులు చిరంజీవి ఎవర్ని ఉద్ధరించడానికి పార్టీ పెట్టారు? మీ మంత్రులు అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడం లేదా? అలాంటప్పుడు వారిని కళంకితులు అనడంలో తప్పేంటి? అని సూటిగా ప్రశ్నించారు. దీంతో బొత్స మీడియా సంస్థలు స్వంత అజెండాలతో పని చేస్తున్నాయంటూ రుసరుసలాడారు.