Sensex: లాక్ డౌన్ సడలింపులతో దూసుకుపోయిన స్టాక్ మార్కెట్

Sensex closes 879 points high

  • వరుసగా నాలుగోరోజు లాభాల్లో ముగిసిన మార్కెట్లు
  • 879 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 246 పాయింట్లు పెరిగిన  నిఫ్టీ

లాక్ డౌన్ నిబంధనలను మరింత సడలించడంతో స్టాక్ మార్కెట్లలో ఉత్సాహం నెలకొంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో మార్కెట్లు వరుసగా నాలుగో రోజు లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 879 పాయింట్లు పెరిగి 33,304కు చేరింది. నిఫ్టీ 246 పాయింట్లు లాభపడి 9,826 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బజాజ్ ఫైనాన్స్ (10.62%), టైటాన్ కంపెనీ (7.23%), టాటా స్టీల్ (6.72%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (6.08%), మహీంద్రా అండ్ మహీంద్రా (5.73%).

టాప్ లూజర్స్:
నెస్లే ఇండియా (-2.31%), సన్ ఫార్మా (-2.17%), అల్ట్రాటెక్ సిమెంట్ (-2.10%), హీరో మోటో కార్ప్ (-1.44%), ఎల్ అండ్ టీ (-0.45%).

  • Loading...

More Telugu News