Bollywood: కరోనాతో బాలీవుడ్ సంగీత దర్శకుడు వాజీద్ ఖాన్ కన్నుమూత

Bollywood musician Wajid Khan succumbs to COVID
  • నెల రోజుల క్రితమే కిడ్నీ మార్పిడి
  • ఇటీవల కరోనా సోకిన వైనం
  • తీవ్ర దిగ్భ్రాంతిలో బాలీవుడ్
గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ముంబైలోని చెంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు వాజీద్ ఖాన్ (42) గత రాత్రి కన్నుమూశారు. నెల రోజుల క్రితమే ఆయన కిడ్నీ మార్పిడి చేయించుకోగా, కొన్ని రోజుల క్రితం కరోనా వైరస్ సంక్రమించింది. బాలీవుడ్‌కు ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ అందించిన వాజిద్ లాక్‌డౌన్ సమయంలో నటుడు సల్మాన్ ఖాన్ ‘భాయ్ భాయ్’ పాటకు సంగీతం అందించారు.

వాజిద్ మృతి వార్త తెలిసిన వెంటనే బాలీవుడ్ విషాదంలో మునిగిపోయింది. ఆయన మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. వాజీద్ మరణాన్ని నమ్మలేకున్నానని, ఆయన మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటని సింగర్ హర్షదీప్ పేర్కొన్నారు. వాజీద్ ఖాన్ నవ్వు తనకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు. వాజీద్ మరణవార్త తనను షాక్‌కు గురిచేసిందని బాలీవుడ్ నుంచి రాజకీయ నేతగా ఎదిగిన సింగర్ బాబుల్ సుప్రియో అన్నారు.
Bollywood
Wajid Khan
musician
COVID-19

More Telugu News