Andhra Pradesh: టీటీడీ ఆస్తుల విక్రయం నిర్ణయాన్ని నిలుపుదల చేస్తూ ఏపీ సర్కారు ఆదేశాలు!

AP Government responds on TTD assets auction

  • వివాదాస్పదంగా మారిన టీటీడీ ఆస్తుల విక్రయం
  • ఎట్టకేలకు స్పందించిన ప్రభుత్వం
  • తక్షణమే నివేదిక పంపాలని టీటీడీ ఈవోకు ఆదేశం

టీటీడీ ఆస్తుల విక్రయం నిర్ణయంపై ఎట్టకేలకు ఏపీ సర్కారు స్పందించింది. ఈ నిర్ణయం తీవ్ర వివాదరూపు దాల్చుతుండడంతో ఈ నిర్ణయాన్ని నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో టీటీడీకి చెందిన 50 ఆస్తుల విక్రయాన్ని అప్పటి పాలకమండలి ఆమోదించిందని, అయితే భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ఆ నిర్ణయాన్ని పునఃసమీక్షించాల్సిందిగా టీటీడీని ఆదేశిస్తున్నట్టు తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఆధ్యాత్మికవేత్తలను, మేధావులను, విధాన కర్తలను, భక్తులను సంప్రదించి ఈ భూములు ఏమైనా టీటీడీ వినియోగించుకునే వీలుందా? వాటిలో ఆలయాలు నిర్మించి ధర్మ ప్రచారం చేసే వెసులుబాటు ఉందేమో పరిశీలించాలని సూచించారు. పైన పేర్కొన్న విధంగా చర్యలు తీసుకునేంత వరకు టీటీడీకి చెందిన 50 ఆస్తుల విక్రయాన్ని నిలిపివేయాలని ఏపీ సర్కారు ఆదేశించింది. ఈ విషయంలో టీటీడీ ఈవో వెంటనే స్పందించి సవివరంగా నివేదిక పంపాలని స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News