Mystery: కూల్ డ్రింకులో నిద్రమాత్రలు కలిపి... బావిలో మృతదేహాల ఘటనలో వీడిన మిస్టరీ!

Mystery revealed in Warangal dead bodies case
  • వరంగల్ శివారు ప్రాంతంలో ఒకే బావిలో 9 మృతదేహాలు
  • పోలీసులకు సవాల్ గా మారిన కేసు
  • నేరం అంగీకరించిన సంజయ్ కుమార్ యాదవ్!
వరంగల్ శివార్లలో ఓ బావిలో 9 మృతదేహాలు లభ్యం కావడం ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పోలీసులకు సైతం ఈ కేసు ఓ సవాల్ లా మారింది. అయితే, వరంగల్ జిల్లా పోలీసులు ఎంతో సమర్థంగా వ్యవహరించడంతో ఈ కేసులో చిక్కుముడి వీడింది.

అనుమానంతో అదుపులోకి తీసుకున్న సంజయ్ కుమార్ యాదవ్ నేరాన్ని అంగీకరించినట్టు సమాచారం. కూల్ డ్రింకులో నిద్రమాత్రలు కలిపి, వారు స్పృహలో లేరని నిర్ధారించుకున్న తర్వాత బావిలో పడేసినట్టు విచారణలో తేలింది. నిందితుడు సంజయ్ కుమార్ యాదవ్ ను రేపు మీడియా ముందుకు తీసుకువస్తారని తెలుస్తోంది. సంజయ్ కుమార్ యాదవ్ బీహార్ కు చెందినవాడిగా గుర్తించారు.
Mystery
Revealed
Warangal
Well
Dead Bodies
Police

More Telugu News