Kiran Rijiju: క్రీడా పోటీల నిర్వహణపై కీలక వ్యాఖ్యలు చేసిన కేంద్ర క్రీడల మంత్రి
- భారత్ లో కరోనా విజృంభణ
- ఇప్పట్లో అంతర్జాతీయ ఈవెంట్లు కష్టమేనన్న కిరణ్ రిజిజు
- ఐపీఎల్ నిర్వహించాలని కోరుకుంటున్న బీసీసీఐ
భారత్ లో కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తున్న నేపథ్యంలో, దేశంలో ఇప్పట్లో అంతర్జాతీయ క్రీడా పోటీలు నిర్వహించే ఆలోచన లేదని కేంద్ర క్రీడల శాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. భవిష్యత్తులో ప్రేక్షకుల్లేకుండా జరిగే పోటీలకు క్రీడా అభిమానులు మానసికంగా సిద్ధం కావాల్సి ఉంటుందని అన్నారు.
ఇప్పటికే వాయిదా పడిన ఐపీఎల్ ను అక్టోబరులో కానీ, నవంబరులో కానీ నిర్వహించాలని భావిస్తున్న బీసీసీఐకి కిరణ్ రిజిజు వ్యాఖ్యలు తీవ్ర నిరాశ కలిగించేవే! ఆస్ట్రేలియాలో జరగాల్సిన టీ20 వరల్డ్ కప్ వాయిదా పడితే, ఆ సమయంలో ఐపీఎల్ నిర్వహించాలన్నది బీసీసీఐ ప్లాన్. కానీ కేంద్రం ఆలోచనలు చూస్తే, సమీప భవిష్యత్తులో భారత్ లో ఓ అంతర్జాతీయ ఈవెంట్ నిర్వహించడం కష్టమేనని అర్థమవుతోంది.