: ఐపీఎల్ నిర్వాహకులకు సుప్రీం ఊరట


స్పాట్ ఫిక్సింగ్ నేపథ్యంలో ఐపీఎల్ ను ఎందుకు రద్దు చేయకూడదంటూ దాఖలైన పిటిషన్ పై సుప్రీం కోర్టు నేడు విచారణ చేపట్టింది. ఐపీఎల్ టోర్నీపై నిషేధం విధించలేమని పేర్కొన్న అత్యున్నత న్యాయస్థానం పిటిషన్ ను కొట్టేసింది. ఇక ఫిక్సింగ్ వ్యవహారంలో బీసీసీఐకి పలు మార్గదర్శకాలు జారీ చేసింది. ఆటలో అక్రమాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇకముందు ఇలాంటి అవినీతి చర్యలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని క్రికెట్ బోర్డుకు దిశానిర్ధేశం చేసింది. ఏక సభ్య కమిటీ ఏర్పాటు చేసి 15 రోజుల్లోగా నివేదిక అందించాలని ఆదేశించింది.

దర్యాప్తు పూర్తయ్యేవరకు ఐపీఎల్ నిలిపివేయాలంటూ, అవస్థి అనే న్యాయవాది సోమవారం సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అంతేగాకుండా, ఈ కుంభకోణంపై విచారణ జరిపేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (ఎస్ఐటి)ను ఏర్పాటు చేయాలని తన పిటిషల్ లో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News