Corona Virus: రూపు మార్చుకున్న కరోనా... చైనాలో కొత్త కేసుల ద్వారా వెల్లడి!

Corona Virus Changed in China More Dangerous
  • గతంలో కనిపించిన వైరస్ తో పోలిస్తే భిన్నం
  • చాలా కాలం పాటు లక్షణాలు బయటపడడం లేదు 
  • ఈలోగానే ఎంతో మందికి సోకుతున్న వైరస్
  • వివరాలు వెల్లడించిన డాక్టర్ క్వి హైబో
కరోనా మహమ్మారి తన తీరు మార్చుకుని మరింత బలపడింది. చైనాలో కొత్తగా నమోదవుతున్న కేసుల్లోని వైరస్, గతంలో కనిపించిన వైరస్ తో పోలిస్తే భిన్నంగా ఉందని డాక్టర్లు గుర్తించారు.

తాజాగా ఉత్తర ప్రావిన్స్ లోని జిలిన్, హీలాంగ్ జియాంగ్ తదితర ప్రాంతాల్లో సోకుతున్న వైరస్ శరీరంలో చాలాకాలం పాటు పాతుకుపోతున్నదని, వారు కోలుకునేందుకు మరింత సమయం పడుతోందని వైద్య నిపుణుడు క్వి హైబో వెల్లడించారు. ఈ వైరస్ సోకిన వారిలో చాలా కాలం పాటు ఎటువంటి లక్షణాలూ బయటపడటం లేదని, ఈలోగానే ఎంతో మందికి వైరస్ సోకుతోందని ఆయన అన్నారు.

ఈ కొత్త వైరస్ సోకిన వారిలో అత్యధికులకు ఊపిరి తిత్తులకు చెందిన సమస్యలు వస్తున్నాయని వ్యాఖ్యానించిన హైబో, వోహాన్ లో బయటకు వచ్చిన వైరస్ తో రోగులు గుండె, కిడ్నీ, పేగు సంబంధిత రుగ్మతలతో బాధపడ్డారని అన్నారు. రష్యా నుంచి చైనాకు వస్తున్న వారిలో ఈ వైరస్ లక్షణాలు అధికంగా కనిపిస్తున్నాయని తెలిపారు.

ఇదిలావుండగా, చైనాలో తిరిగి విజృంభిస్తున్న మహమ్మారి, తాజాగా 16 మందికి సోకింది. సింగపూర్ లో 570, పాకిస్థాన్ లో 1,932 మంది వ్యాధి బారిన పడ్డారని అధికారులు వెల్లడించారు.  
Corona Virus
China
Change

More Telugu News