Andhra Pradesh: ఏపీలో గణనీయంగా పెరుగుతున్న కేసులు.. 2,560కి చేరిన వైనం!

Corona virus cases reached to 2500 mark in AP

  • మార్చి 21న ఐదుగా ఉన్న కేసులు
  • ప్రస్తుతం 9 రోజులకు 500 కేసులు వెలుగు చూస్తున్న వైనం
  • ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 153 మందికి కరోనా

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. నిన్నటికి 2,560కి చేరుకున్నట్టు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వీరిలో రాష్ట్రానికి చెందిన వారు 2,407 మంది కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 153 మంది ఉన్నారు. ఇక నిన్న 9,159 మందికి పరీక్షలు నిర్వహించగా 68 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది.

కర్నూలు జిల్లాలో నిన్న ఒకరు మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 53కు పెరిగింది. మొదట్లో తొలి 500 కేసులకు 25 రోజులు పట్టగా, ప్రస్తుతం 9 రోజుల్లోనే 500 కేసులు వెలుగు చూస్తున్నాయి. మార్చి 21న రాష్ట్రంలో కేవలం 5 కేసులు మాత్రమే ఉండగా, ఏప్రిల్ 15 నాటికి ఏకంగా 525కు చేరుకున్నాయి. ఆ తర్వాతి నుంచి వేగంగా పెరుగుతూ బుధవారం నాటికి 2,560 కేసులకు చేరుకున్నాయి.

Andhra Pradesh
Corona Virus
corona deaths
  • Loading...

More Telugu News