ima: డాక్టర్‌ సుధాకర్‌పై పోలీసుల తీరుపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ స్పందన.. జగన్‌కు లేఖ

IMA to YS Jagan Mohan Reddy Dr Sudhakar being manhandled by

  • సుధాకర్‌పై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలి
  • ఆయనను తిరిగి వెంటనే విధుల్లోకి తీసుకోవాలి
  • దురుసుగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి

డాక్టర్ సుధాకర్ పట్ల విశాఖపట్నం పోలీసులు ప్రవర్తించిన తీరుపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) స్పందించింది. ఈ ఘటనపై నిరసన వ్యక్తం చేస్తూ ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాసింది.

'మే 16న  ప్రభుత్వ డాక్టర్ సుధాకర్ రావుపై పోలీసులు ప్రవర్తించిన తీరు సరికాదు. వారి తీరుపై ఐఎంఏ తీవ్ర నిరసన తెలుపుతోంది. పరిస్థితులను అదుపు చేయడానికి సరైన పద్ధతులు ఉంటాయి. ఆసుపత్రిలో వైద్యుల రక్షణ విషయంపై ఆయన  నిలదీసినందుకు ఇప్పటికే ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది. సీఎంపై ఆ వైద్యుడు అనుచిత వ్యాఖ్యలు సరికాదని మా అసోసియేషన్ స్పష్టం చేస్తోంది'  అని ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ రాజన్ శర్మతో పాటు పలువురు ప్రతినిధులు పేర్కొన్నారు.

'మరోవైపు, ప్రభుత్వ వైద్యుడిపై పోలీసులు ఇలా ప్రవర్తించడం కలచివేస్తోంది. దేశ వ్యాప్తంగా ఉన్న వైద్యులను బాధపెట్టింది. ఐఎంఏకు చెందిన ఓ నిజనిర్ధారణ క‌మిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా సీఎంకు ఈ లేఖ రాస్తున్నాం. సస్పెన్షన్‌ ప్రభావం సుధాకర్ మానసిక ఆరోగ్యంపై పడిందని ఆ ప్యానెల్ గుర్తించింది. దీని వల్ల ఆయన కుటుంబం ఆవేదన చెందుతోంది' అని ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ రాజన్ శర్మతో పాటు పలువురు ప్రతినిధులు పేర్కొన్నారు.

సుధాకర్‌పై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని ఐఎంఏ డిమాండ్ చేసింది. అలాగే, ఆయనను తిరిగి వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరింది. ఆయనపై దురుసుగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

  • Loading...

More Telugu News