Uttar Pradesh: మీకు చేత కాదు.. మేము సలహాలిస్తే వెటకారం చేస్తారు!: ఉత్తమ్ కుమార్ రెడ్డి
- ఇష్టమొచ్చినట్టు రంగులు మార్చడం మీ రాజకీయంలో నడుస్తదేమో
- టెస్టులు చేయకుండా సూర్యాపేటను గ్రీన్ జోన్ గా ఎట్లా నిర్ధారించారు?
- హైకోర్టు ఎన్ని మొట్టికాయలు వేసినా ప్రభుత్వానికి బుద్ధి రాదు
పూర్తిస్థాయిలో కొవిడ్-19 పరీక్షలు చేయకుండానే సూర్యాపేటను కరోనా రహిత జిల్లాగా ఎలా ప్రకటిస్తారని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించిన నేపథ్యంలో దీనిపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు.
'మీ ఇష్టమొచ్చినట్టు రంగులు మార్చడం మీ రాజకీయంలో నడుస్తదేమో, కరోనాతో కాదు. టెస్టులు చేయకుండా సూర్యాపేటను గ్రీన్ జోన్ గా ఎట్లా నిర్ధారించారు? టెస్టుల విషయంలో హైకోర్టు ఎన్ని మొట్టికాయలు వేసినా ప్రభుత్వానికి బుద్ధి రాదు. మీకు చేత కాదు, మేము సలహాలిస్తే వెటకారం చేస్తారు!' అంటూ ఉత్తమ్ కుమార్ విమర్శించారు.
కాగా, సూర్యాపేటతో పాటు రాష్ట్రంలో ఏప్రిల్ 22 నుంచి ఇప్పటి వరకు ఎన్ని వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించారో తెలపాలని ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు నిన్న ఆదేశించింది. కరోనా పరీక్షలు ప్రాథమిక అనుమానితులకు చేసి, లక్షణాలు లేని రోగులకు చేయడం లేదంటూ సంకినేని వరుణ్‌రావు దాఖలు చేసిన పిల్‌ను నిన్న న్యాయస్థానం విచారించింది. ఇందుకు సంబంధించిన వార్తను ఉత్తమ్ కుమార్ రెడ్డి పోస్ట్ చేసి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.