Ramcharan: సురేందర్ రెడ్డితో మళ్లీ చరణ్ సినిమా!

Charan joins hands with surendar Reddy again
  • గతంలో వీరి కలయికలో 'ధృవ'
  • స్టయిల్ నచ్చడంతో 'సైరా'కు ఛాన్స్
  • ప్రస్తుతం జరుగుతున్న కథా చర్చలు
 రామ్ చరణ్, సురేందర్ రెడ్డి కాంబినేషన్లో మరో చిత్ర నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి. గతంలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చరణ్ 'ధృవ' చిత్రాన్ని చేశాడు. అది చరణ్ ను సరికొత్తగా చూపించడమే కాకుండా, అభిమానులను కూడా అలరించింది. అతని స్టయిల్ నచ్చడంతోనే తన తండ్రి చిరంజీవితో నిర్మించిన 'సైరా' చిత్రానికి సురేందర్ రెడ్డికి దర్శకత్వ బాధ్యతల్ని చరణ్ అప్పగించాడు.

ఇక ఇప్పుడు తను రాజమౌళితో చేస్తున్న 'ఆర్ఆర్ఆర్' తర్వాత చేయడానికి ఇంకా ఏ చిత్రం కమిట్ కాలేదు. పలువురు దర్శకులు చెబుతున్న కథలు వింటున్నప్పటికీ, ఎవరికీ ఆయన ఓకే చెప్పలేదు. ఈ నేపథ్యంలో సురేందర్ రెడ్డితో మరో సినిమా చేయాలని చరణ్ నిర్ణయించుకున్నాడని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన కథా చర్చలు కూడా ప్రస్తుతం జరుగుతున్నట్టు, 'ఆర్ఆర్ఆర్' తర్వాత ఇదే సెట్స్ కి వెళ్లనున్నట్టూ సమాచారం.
Ramcharan
Chiranjeevi
Surendar Reddy
Saira

More Telugu News