Jagan: లాక్‌డౌన్‌పై నేడు జగన్ ఉన్నతస్థాయి భేటీ.. పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం

jagan on corona

  • క్యాంపు కార్యాలయంలో ఉదయం 11.30 గంటలకు ప్రారంభం 
  • ఏపీ ఎన్విరాన్‌మెంట్ ఇంప్రూవ్‌మెంట్ చట్టం-2020పై చర్చ
  • బస్సులు తిప్పేందుకు మార్గదర్శకాలు రూపొందించాలని ఆదేశం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అధికారులతో ఉన్నతస్థాయి సమావేశంలో పాల్గొననున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఉదయం 11.30 గంటలకు ప్రారంభం కానున్న ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకోనున్నారు. ఏపీ ఎన్విరాన్‌మెంట్ ఇంప్రూవ్‌మెంట్ చట్టం-2020 పై ఆయన చర్చిస్తారు.

ఏపీలో ఈ నెల 31 వరకు లాక్‌డౌన్‌ను పొడిగించిన నేపథ్యంలో దీనిపై కూడా నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇప్పటికే లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీచేసిన ఏపీ సర్కారు.. ఇందుకోసం విపత్తు నిర్వహణ చట్టాన్ని సవరించింది. ఏపీలో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన మరిన్ని చర్యలపై ఉన్నతస్థాయి సమావేశంలో జగన్‌ కీలక నిర్ణయాలు తీసుకుని ప్రకటించే అవకాశం ఉంది.

నాలుగో విడత లాక్‌డౌన్‌పై కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల అమలు, ప్రజా రవాణా వాహనాలకు అనుమతినిచ్చే అంశంపై ఆయన కీలక ప్రకటనలు చేయనున్నారు. రాష్ట్రాల్లో బస్సులు నడిపే అంశంపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని రాష్ట్రాలకు ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. బస్సులు తిప్పేందుకు మార్గదర్శకాలు రూపొందించాలని ఇప్పటికే అధికారులను జగన్ ఆదేశించారు.

  • Loading...

More Telugu News