Rasi Khanna: పుకార్లను పెద్దగా పట్టించుకోను: హీరోయిన్ రాశి ఖన్నా

Rasi Khanna

  • విభిన్నమైన పాత్రలపట్ల ఆసక్తి
  • ఎవరినీ పోటీగా భావించను
  • సింపుల్ గా ఉండటానికి ఇష్టపడతానన్న రాశి ఖన్నా

తెలుగు తెరపై అందాల కథానాయికగా రాశి ఖన్నాకి మంచి క్రేజ్ వుంది.  ఆమె తాజా చిత్రంగా 'అరన్మణి 3' రూపొందుతోంది. లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ .. "ఈ మధ్య కాలంలో నేను విభిన్నమైన పాత్రలకే ప్రాధాన్యతనిస్తున్నాను. ఆ పాత్రల్లో ప్రేక్షకులు నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటున్నారనేది గమనిస్తున్నాను. వాళ్ల నుంచి వస్తున్న రెస్పాన్స్ ను బట్టి, తరువాత ప్రాజెక్టులను ఒప్పుకుంటున్నాను.  

నాపై గాసిప్స్ రాకపోవడానికి కారణం ఏమిటని చాలామంది అడుగుతున్నారు. అందుకు అవకాశం ఇవ్వకపోవడమే కారణం. ఒకవేళ గాసిప్స్ వచ్చినా వాటిని నేను పెద్దగా పట్టించుకోను. ఎవరినీ పోటీగా భావించకుండా నా పనిని నేను చేసుకుపోతుంటాను. ఖాళీ సమయాన్ని కుటుంబ సభ్యులతో గడపడానికి ఇష్టపడతాను. తెరపై నేను ఎలా కనిపించినప్పటికీ, బయట మాత్రం ఆధ్యాత్మికత .. బిడియం కలిగిన అమ్మాయిగానే వుంటాను. ఏ విషయంలోనైనా ఆర్భాటాలకు పోకుండా సింపుల్ గా ఉండటానికి నేను ఇష్టపడతాను" అని చెప్పుకొచ్చింది.

Rasi Khanna
Actress
Tollywood
  • Loading...

More Telugu News