: శ్రీశాంత్ కు తెలుగు చిత్ర రంగంతో సంబంధం లేదు: నిర్మాతల మండలి
స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలపై అరెస్టయిన క్రికెటర్ శ్రీశాంత్ తో తెలుగు చిత్ర పరిశ్రమలోని ఏ నిర్మాతతోనూ సంబంధం లేదని తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి స్పష్టం చేసింది. శ్రీశాంత్ కు ఒక తెలుగు నిర్మాతతో సంబంధం ఉన్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో నిర్మాతల మండలి స్పందించింది. అసలు టాలీవుడ్ లో కాస్టింగ్ డైరెక్టర్ అనేవారే లేరని తెలిపింది. శ్రీశాంత్ తో ఎవరికైనా సంబంధం ఉందని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.