Mahesh Vitta: నా ఫ్రెండ్ కి కూడా అలాంటి అనుభవం ఎదురైంది: కమెడియన్ మహేశ్ విట్టా

Mahesh Vitta

  • నా ఫ్రెండ్  స్మార్ట్ గా ఉంటాడు
  • అవకాశాల కోసం ఆఫీసులకు వెళ్లాడు
  • అక్కడ్నించి పారిపోయి వచ్చాడన్న మహేశ్ విట్టా  

చిత్రపరిశ్రమలో లైంగిక వేధింపులు అనే అంశం ఆ మధ్య హాలీవుడ్ మొదలు అన్ని చిత్రపరిశ్రమలను ఒక కుదుపు కుదిపేసింది. ఎవరికి వారు  తమకి ఎదురైన అనుభవాలను ధైర్యంగా ముందుకు వచ్చి చెప్పారు. ఈ పరిస్థితులకు వెంటనే తెరపడాలంటూ నిరసన గళాలను వినిపించారు. కొంతమంది మగాళ్లు కూడా తమకీ అలాంటి పరిస్థితులు ఎదురైనట్టుగా చెప్పుకున్నారు.

తాజాగా అదే విషయాన్ని గురించి యంగ్ కమెడియన్ మహేశ్ విట్టా ప్రస్తావించాడు. ఇండస్ట్రీలో ఆడవాళ్లు మాత్రమే కాదు .. మగాళ్లు కూడా క్యాస్టింగ్ కౌచ్ బారిన పడుతున్నారు. నా స్నేహితుడు ఒకడు చాలా స్మార్ట్ గా ఉంటాడు. సినిమాల్లో అవకాశాల కోసం కొంతకాలంగా ప్రయత్నిస్తున్నాడు. ఆ క్రమంలో ఒకటి రెండు  ప్రొడక్షన్ హౌస్ లకి వెళ్లాడు. ఏదైనా అవకాశం వుంటే ఇవ్వమని అక్కడి వాళ్లను అడిగాడు. అక్కడున్న ఓ నిర్మాత వాడిని సెక్సువల్ ఫేవర్ అడిగాడట ..  దాంతో వాడు అక్కడి నుంచి పారిపోయి వచ్చేశాడు. జరిగిందంతా వాడు చెబుతుంటే ఇలాంటివాళ్లు కూడా వుంటారా? అని నేను ఆశ్చర్యపోయాను" అంటూ చెప్పుకొచ్చాడు.

Mahesh Vitta
Actor
Tollywood
  • Loading...

More Telugu News