Pothireddypadu: ఏపీ ప్రభుత్వ తీరుపై ఫిర్యాదు చేసిన తెలంగాణ!

  • విభజన చట్టానికి విరుద్ధంగా ప్రాజెక్టును చేపడుతున్నారు
  • కొత్త ప్రాజెక్టును చేపట్టకుండా చర్యలు తీసుకోండి
  • టెండర్లను చేపట్టకుండా చూడండి

శ్రీశైలం బ్యాక్ వాటర్ ను పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి రోజుకు 3 టీఎంసీల నీటిని అదనంగా తీసుకోవడానికి ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వం కృష్ణా యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేసింది. విభజన చట్టానికి విరుద్ధంగా ప్రాజెక్టును చేపడుతున్నారని కృష్ణా యాజమాన్య బోర్డు ఛైర్మన్ కు టీఎస్ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ లేఖ రాశారు.

ఉన్నత స్థాయి కౌన్సిల్ అనుమతి లేకుండా ప్రాజెక్టును చేపట్టడం చట్ట విరుద్ధమని చెప్పారు. కొత్త ప్రాజెక్టు పనుల టెండర్లను ఏపీ ప్రభుత్వం చేపట్టకుండా చూడాలని విన్నవించారు. రేపు మధ్యాహ్నం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కృష్ణా రివర్ బోర్డు ఛైర్మన్ తో రజత్ కుమార్ మాట్లాడనున్నారు.

  • Loading...

More Telugu News