Vande Bharat: 149 విమానాలతో వందేభారత్ మిషన్-2
- ప్రపంచవ్యాప్తంగా చిక్కుకుపోయిన భారతీయులు
- స్వదేశానికి తీసుకువచ్చేందుకు వందేభారత్ మిషన్
- తొలి విడతలో 64 విమానాలతో తరలింపు
ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం లాక్ డౌన్ తరహా పరిస్థితులు నెలకొనడంతో అనేక దేశాల్లో భారతీయులు చిక్కుకుపోయారు. అంతేకాదు, విదేశాల్లో ఉంటున్న భారతీయులు సైతం స్వదేశానికి వచ్చేందుకు మొగ్గు చూపుతుండడంతో కేంద్రం వందేభారత్ మిషన్ ప్రారంభించింది. తొలివిడతలో 64 విమానాలతో విదేశాల్లో ఉన్న భారతీయులను స్వదేశానికి తీసుకువస్తోంది.
ఇప్పుడు రెండో దశ వందేభారత్ మిషన్ మే 16 నుంచి 22 వరకు నిర్వహించాలని కేంద్రం భావిస్తోంది. ఈసారి భారీగా 149 విమానాలను రంగంలోకి దింపనున్నారు. వీటిలో 13 విమానాలు అమెరికాకు, 9 విమానాలు బ్రిటన్ కు, 10 విమానాలు కెనడాకు, యూఏఈకి 11 విమానాలు, రష్యాకు 6 విమానాలు వెళ్లనున్నాయి. ఈసారి 31 దేశాల్లో ఉన్న భారతీయులను తీసుకువస్తారని అధికార వర్గాలంటున్నాయి.