Vijay: 'మాస్టర్'కి డబ్బింగ్ చెబుతున్న విజయ్

Master Movie

  • విజయ్ హీరోగా రానున్న 'మాస్టర్'
  • దర్శకుడిగా లోకేశ్ కనగరాజ్
  •  ప్రతినాయకుడిగా విజయ్ సేతుపతి  

విజయ్ హీరోగా 'మాస్టర్' చిత్రం రూపొందుతోంది. 'ఖైదీ' వంటి సూపర్ హిట్ ఇచ్చిన లోకేశ్ కనగరాజ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. లాక్ డౌన్  కారణంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆగిపోయాయి. రీసెంట్ గా తమిళనాడులో సినిమాల పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకోవడానికి అనుమతి లభించింది. దాంతో ఆ సమయం కోసం ఎదురుచూస్తున్న దర్శక నిర్మాతలు రంగంలోకి దిగిపోయారు. 'మాస్టర్' సినిమాకి సంబంధించిన డబ్బింగ్ పనులను మొదలు పెట్టేశారు.

ప్రస్తుతం విజయ్ తన పాత్రకి డబ్బింగ్ చెప్పుకుంటున్నాడు. ఆయన తన పాత్రకి డబ్బింగ్ చెప్పుకోవడం పూర్తికాగానే, విజయ్ సేతుపతి తన పాత్రకి డబ్బింగ్ చెప్పడం జరుగుతుందని అంటున్నారు. ఈ  సినిమాలో విజయ్ సరసన నాయికగా మాళవిక మోహనన్ నటించింది. తెలుగులో కూడా తన సినిమాలు విడుదలయ్యేలా విజయ్  శ్రద్ధ తీసుకుంటూ ఉంటాడు. ఇక లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో కార్తీ కథానాయకుడిగా ఇంతకుముందు వచ్చిన 'ఖైదీ' తెలుగులోను భారీ విజయాన్ని నమోదు చేసింది. అందువలన విజయ్ 'మాస్టర్' తెలుగులో కూడా విడుదలవుతుందని అంటున్నారు.

Vijay
Malavika Mohanan
Lokesh kanagaraj
  • Loading...

More Telugu News