ASI: కరోనాకు భయపడి సీఆర్పీఎఫ్ ఏఎస్ఐ ఆత్మహత్య

CISF ASI commits suicide in Jammu and Kashmir
  • జమ్మూకశ్మీర్ లో ఘటన
  • సర్వీస్ రైఫిల్ తో కాల్చుకున్న ఏఎస్ఐ
  • ఆసుపత్రికి తీసుకెళ్లినా దక్కని ప్రాణాలు
కరోనా మహమ్మారి ప్రతి ఒక్కరిని భయాందోళనలకు గురిచేస్తోంది. దీని వ్యాప్తి తీరుతెన్నులపై రకరకాల ప్రచారాలు జరుగుతుండడం కూడా ప్రజల్లో అలజడికి కారణమవుతోంది. తాజాగా, సీఆర్పీఎఫ్ లో పనిచేస్తున్న ఏఎస్ఐ ఒకరు కరోనాకు భయపడి ఆత్మహత్య చేసుకోవడం పారామిలిటరీ వర్గాల్లో కలకలం రేపింది.

ఈ ఘటన జమ్మూకశ్మీర్ అనంతనాగ్ జిల్లాలో జరిగింది. జమ్మూలోని అక్నూర్ కు చెందిన ఫతేసింగ్ సీఆర్పీఎఫ్ లో అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే, విధి నిర్వహణలో ఉండగా సర్వీస్ తుపాకీతో కాల్చుకుని బలవన్మరణం చెందాడు. తీవ్రగాయాలతో పడివున్న ఫతేసింగ్ ను సహచరులు ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. అప్పటికే ఆ ఏఎస్ఐ మరణించాడని డాక్టర్లు చెప్పారు. సూసైడ్ నోట్ ను పరిశీలించగా, తనకు కరోనా వస్తుందేమోనన్న భయంతోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు పేర్కొన్నాడు. ఈ ఘటనపై శాఖాపరమైన దర్యాప్తు జరుగుతోంది.
ASI
CISF
Corona Virus
Suicide
Jammu And Kashmir

More Telugu News