Southwest Monsoon: ఈసారి రెండు రోజుల ముందుగానే.. 16న అండమాన్‌‌ను తాకనున్న నైరుతి రుతుపవనాలు

Southwest monsoon touches Andaman on the 16th
  • వెల్లడించిన హైదరాబాద్ వాతావరణ విభాగం
  • గతేడాది మే 18న అండమాన్‌ను తాకిన పవనాలు
  • తెలంగాణలోకి ప్రవేశంపై ఒకటి రెండు రోజుల్లో ప్రకటన
గతేడాది కంటే ఈసారి రెండు రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు అండమాన్‌లోకి ప్రవేశించనున్నాయి. గతేడాది మే 18న అండమాన్‌లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించగా, ఈసారి 16నే  ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్‌ సముద్రం, నికోబార్‌ దీవుల్లోని కొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశిస్తాయని హైదరాబాద్  వాతావరణ కేంద్రం తెలిపింది. కేరళ, తెలంగాణ సహా ఇతర ప్రాంతాల్లో నైరుతి ఎప్పుడు ప్రవేశిస్తుందన్న దానిపై ఒకటి రెండు రోజుల్లో భారత వాతావరణ విభాగం ప్రకటన చేసే అవకాశం ఉంది.
Southwest Monsoon
Andaman
Telangana
Kerala

More Telugu News