Lawrence Raghavendra: విజయ్ హీరోగా లారెన్స్ మూవీ

Lawrence Movie

  • గతంలో లారెన్స్ నుంచి వచ్చిన మాస్ కథలు
  • హారర్ కామెడీ జోనర్ నుంచి ఎక్కువ సక్సెస్ లు
  • వచ్చే ఏడాది ద్వితీయార్థంలో సెట్స్ పైకి

నృత్య దర్శకుడిగా .. నటుడిగా .. దర్శకుడిగా లారెన్స్ తన సత్తా చాటుకున్నాడు. ముఖ్యంగా హారర్ కామెడీ జోనర్లో ఆయన సినిమాలు వరుస విజయాలను సాధించాయి. దాంతో ఆయన అదే తరహా కథలను సిద్ధం చేసుకుంటూ వెళుతున్నాడు. అయితే స్టార్ హీరోలతో లారెన్స్ దర్శకుడిగా హిట్లు కొట్టలేకపోయాడమనే విమర్శ కోలీవుడ్ లో వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన ఏకంగా విజయ్ తోనే ఒక భారీ బడ్జెట్ సినిమాను ప్లాన్ చేసినట్టుగా సమాచారం.

ఈ ఇద్దరి కాంబినేషన్లో ఒక సినిమా పట్టాలెక్కడం ఖాయమైపోయిందనే టాక్ బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ 'మాస్టర్' సినిమా చేస్తున్నాడు. ఆ తరువాత సినిమాను మురుగదాస్ దర్శకత్వంలో చేయనున్నాడు. ఆ సినిమా పూర్తయిన తరువాత లారెన్స్ తో సెట్స్ పైకి వెళ్లనున్నాడని అంటున్నారు. లారెన్స్ మాస్ ఆడియన్స్ కి ఎక్కువగా కనెక్ట్ అయ్యే కథలను తయారు చేసుకుంటాడు. ఇక విజయ్ కి కూడా మాస్ ఫాలోయింగ్ ఎక్కువ. అందువలన ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందనున్న సినిమా, పక్కా మాస్ కంటెంట్ తోనే వుంటుందనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Lawrence Raghavendra
Vijay
Lokesh kanagaraj
  • Loading...

More Telugu News