Centre: వైద్య సిబ్బందిపై ఆంక్షలు వద్దు... క్లినిక్కులు, నర్సింగ్ హోంలు తెరిపించండి: రాష్ట్రాలకు కేంద్రం సూచన

Centre wants states to ensure free movement of medical personal

  • ఆయా రాష్ట్రాల్లో వైద్య సిబ్బందిపై ఆంక్షలు
  • కరోనాపై పోరులో వైద్య సిబ్బంది కీలకమన్న కేంద్రం
  • రాష్ట్రాల సీఎస్ లకు లేఖ రాసిన కేంద్ర హోంశాఖ కార్యదర్శి

భారత్ లో కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా వైద్య నిపుణులు, పారా మెడికల్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, అంబులెన్సులపై ఆంక్షలు విధించరాదని, వారి అంతర్రాష్ట్ర ప్రయాణాలకు అభ్యంతరం చెప్పరాదని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను కోరింది.

 లాక్ డౌన్ నేపథ్యంలో కొన్ని రాష్ట్రాలు వైద్య, ఆరోగ్య సిబ్బందిపై కఠిన నియమావళి అమలు చేస్తున్నాయి. అయితే, కరోనాపై పోరులో కీలకమైన వైద్యసిబ్బందిపై ఆంక్షలు సరికాదని, ఇతర రాష్ట్రాల్లో వారి సేవలు అవసరమైనప్పుడు ఇలాంటి అంక్షలు అడ్డంకిగా ఉండరాదని కేంద్ర హోంశాఖ అభిప్రాయపడింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు లేఖ రాశారు. అంతేగాకుండా, ప్రైవేటు నర్సింగ్ హోంలు, క్లినిక్కులు తెరిచేలా ఆదేశాలు ఇవ్వాలంటూ సీఎస్ లకు సూచించారు.

  • Loading...

More Telugu News