: ఇంతులతో బంతులాడిన శ్రీశాంత్
శ్రీశాంత్... భాతర క్రికెట్లో ఉవ్వెత్తున ఎగిసిపడిన యువకెరటం. తొలినాళ్ళలో వేగవంతమైన బంతులేసి గుర్తింపుతెచ్చుకున్న ఈ ఆటగాడు వివాదాల్లోనే ఎక్కువగా మసిలాడు. ప్రపంచ దేశాల్లోని ప్రతిజట్టులోని బ్యాట్స్ మన్ నూ తన నోటిదురుసుతో శత్రువులుగా చేసుకున్నాడు. అలాగని టీమిండియాలో కూడా శ్రీశాంత్ కి పెద్దగా మిత్రులు లేరు. దీనికి తోడు ఆటకంటే శ్రీశాంత్ కి ఇతర వ్యాపకాలెక్కువ. హీరోనైపోదామని కలలు కన్నాడు. చిత్రసీమలో వెలిగిపోవాలని రంగుల లోకంలో విహరించాడు. అందుకే సినీరంగంలోని పలువురితో పరిచయాలు పెంచుకున్నాడు.
ఢిల్లీ పోలీసుల విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు శ్రీ. యువతులతో సరససల్లాపాల్లో తేలియాడినట్టు ఒప్పుకున్నాడు. హీరోయిన్ చేస్తానంటూ నమ్మబలికి పలువుర్ని మోసం చేసాడని కూడా బయటపడింది. ముంబైలోని స్టార్ హోటల్ లోని ఖరీదైన సూట్ ఏడాదికి బుక్ చేసుకున్నాడు. తన సీక్రెట్ కార్యకలాపాలన్నీ ఇక్కడ్నుంచే నడిపాడు శ్రీశాంత్. ఇతనికి టాలీవుడ్ నిర్మాత, బాలీవుడ్ కాస్టింగ్ డైరెక్టర్ సహకరించడం ఇప్పడు రెండు ఇండస్ట్రీల్లో సంచలనం రేపుతోంది. మైదానంలో బంతులేయాల్సిన శ్రీశాంత్ ఇంతులపైకి సంధించి చేజేతులా భవిష్యత్తు నాశనం చేసుకున్నాడు.