Rajanaikanth: రాష్ట్రంలో మద్యం దుకాణాలు తెరవొద్దుంటూ అన్నాడీఎంకే సర్కార్ పై రజనీకాంత్ వ్యాఖ్యలు!

TamilNadu Super star Rajanikanth comments

  • ప్రస్తుత పరిస్థితుల్లో మద్యం దుకాణాలు తెరవొద్దు
  • ఒకవేళ  తెరిస్తే .. మళ్లీ అధికారంలోకి వస్తామన్న ఆశలు వదులు కోవాల్సిందే
  • ఆదాయ మార్గాల కోసం ఇతర మార్గాలపై దృష్టి సారించాలి

తమిళనాడులోని అన్నా డీఎంకే సర్కార్ పై సూపర్ స్టార్ రజనీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో మద్యం దుకాణాలు తెరవాలన్న ఆలోచనను మానుకోవాలని సూచించారు. ఒకవేళ మద్యం దుకాణాలు తెరిస్తే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి వస్తామన్న ఆశలు వదులుకోవాల్సిందేనని అధికార పార్టీపై వ్యాఖ్యలు చేశారు. ఆదాయ మార్గాల కోసం ఇతర మార్గాలపై దృష్టి సారించాలని ప్రభుత్వానికి సూచించారు.

కాగా, తమిళనాడులో మద్యం దుకాణాలను మూసివేయాలంటూ ప్రభుత్వానికి రెండు రోజుల క్రితం మద్రాస్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.  సీఎం పళనిస్వామి దీనిపై ‘స్టే’ కోరుతూ నిన్న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆన్ లైన్ ద్వారా మద్యం విక్రయించడం, డోర్ డెలివరి చేయడం సాధ్యం కాదని తన పిటిషన్ లో పళనిస్వామి తెలిపారు.  

Rajanaikanth
Tamilnadu
AIADMK
Liquor Shops
  • Loading...

More Telugu News