India: అమెరికా నుంచి స్వదేశానికి ఏడు విమానాల్లో రానున్న 25 వేల మంది భార‌తీయులు

indians to come from amrica

  • అమెరికాలోని 4 ఎయిర్‌పోర్టుల నుంచి భారత్‌కు విమానాలు
  • భారత్‌లోని పలు నగరాల్లోని విమానాశ్రయాలకు చేరుకోనున్న విమానాలు
  • లాక్‌డౌన్‌తో అమెరికాలో చిక్కుకుపోయిన భారతీయులు

లాక్‌డౌన్‌ నేపథ్యంలో అమెరికా నుంచి భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శాన్‌ఫ్రాన్సిస్‌కో నుంచి భార‌త్‌కు తొలి విమానం బయ‌లుదేర‌నుం‌ది. అమెరికాలోని నాలుగు ఎయిర్‌పోర్టుల నుంచి భారత్‌కు ఏడు ఎయిరిండియా విమానాలు న‌డుపుతున్న‌ట్లు భారత రాయబారి త‌ర‌ణ్‌జిత్ సింగ్ సంధు మీడియాకు చెప్పారు.

తొలి దశలో సుమారు 25 వేల మంది భారతీయులు స్వదేశానికి వచ్చేందుకు తమ పేర్లను నమోదు చేసుకున్న‌ట్లు ఆయ‌న వివరించారు. భారత్‌లోని పలు నగరాల్లోని విమానాశ్రయాలకు అవి చేరుకుంటాయని చెప్పారు. కాగా, కరోనా వ్యాక్సిన్‌ కోసం భారత్‌, అమెరికా కలిసి పనిచేస్తున్నట్లు ఆయన వివరించారు.

భారత్‌లోని ఐసీఎంఆర్‌, అమెరికాలోని సీడీసీ-ఎన్ఐసీలు చాలా ఏళ్ల నుంచి ఆరోగ్య రంగంలో కలిసి పనిచేస్తున్నాయని గుర్తు చేశారు. రెండేళ్ల‌క్రితం ఈ రెండు సంస్థలు కలిసి రోటోవైర‌స్ కోసం వ్యాక్సిన్ క‌నుగొన్నాయని, దానితో భార‌త్‌, అమెరికా సహా  అనేక దేశాలు లాభపడ్డాయని వివరించారు. ఇరు దేశాలు కలిసి మూడు వ్యాక్సిన్ల త‌యారీలో క‌లిసి ప‌నిచేస్తున్నాయని చెప్పారు.

  • Loading...

More Telugu News