Bakery: ముస్లింలను కించపరిచేలా ప్రకటన.. చెన్నైలో బేకరీ యజమాని అరెస్టు
- మా షాపులో పదార్థాలన్నీ జైన మతస్థులు తయారు చేసినవే
- మా వద్ద ముస్లింలు ఎవరూ పనిచేయడం లేదు
- ముస్లింలను కించపరుస్తూ ‘వాట్సప్’ ద్వారా ప్రకటన
ముస్లింలను కించపరిచేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన చెన్నైలోని ఓ బేకరీ యజమానిని పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక టీ నగర్ లోని జైన్ బేకరీస్ అండ్ కన్ఫెక్షనరీస్ పేరిట బేకరీ షాపు నిర్వహిస్తున్నాడు. ఢిల్లీలోని తబ్లిగీ జమాత్ ఘటన తర్వాత దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరగడంతో ముస్లింలు నిర్వహించే లేదా వారు పనిచేసే దుకాణాల్లో వస్తువులు కొనుగోలు చేయొద్దంటూ దుష్ప్రచారం నేపథ్యంలో సదరు బేకరీ యజమాని ఓ ప్రకటన చేశాడు.
తమ షాపులోని తినుబండారాలన్నీ జైన మతస్థులు తయారు చేసినవేనని, తమ వద్ద ముస్లింలు ఎవరూ పనిచేయడం లేదంటూ చేసిన ఈ ప్రకటనను ‘వాట్సప్’ ద్వారా తమ వినియోగదారులకు షేర్ చేశాడు. ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పోలీసులు స్పందించారు. వెంటనే యజమానిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.