Visakhapatnam District: గుర్రంపై వెళ్లిన వైసీపీ మహిళా ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి

YSRCP Paderu MLA Bhagyalaxmi rides on Horse

  • ఏజెన్సీ ప్రాంత ప్రజల పరామర్శకు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి
  • సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో గుర్రాన్ని ఆశ్రయించిన ఎమ్మెల్యే
  • ఇబ్బంది లేకుండా నిత్యావసర వస్తువులు పంపిస్తామని హామీ

విశాఖపట్టణం జిల్లా పాడేరు వైసీపీ మహిళా ఎమ్మెల్యే  భాగ్యలక్ష్మి గుర్రమెక్కారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంత ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారన్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వారి వద్దకు పయనమయ్యారు. అయితే, అటవీ గ్రామాల్లోకి వెళ్లేందుకు సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో వాహనంలో ప్రయాణించే వీలు లేకపోయింది. దీంతో ఆమె గుర్రాన్ని ఎంచుకున్నారు. డింగిరాయి నుంచి చిత్తమామిడి వరకు గుర్రంపైనే ప్రయాణించారు. స్థానికులను కలిసి వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఇబ్బంది లేకుండా నిత్యావసర సరుకులు పంపిస్తామని వారికి హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి గుర్రంపై ప్రయాణిస్తున్న ఫొటోలు, వీడియో బయటకు రావడంతో వైరల్ అయ్యాయి.

Visakhapatnam District
Paderu MLA
Bhagyalaxmi
YSRCP
  • Loading...

More Telugu News