Moodys: భారత్ ఆర్థిక వృద్ధిరేటును 'సున్నా'గా అంచనా వేసిన మూడీస్
- ఈ ఏడాది ఆర్థిక వృద్ధిరేటు నమోదు కాదు
- వచ్చే ఏడాది 6.6 శాతానికి పుంజుకుంటుంది
- ఈ ఏడాది ద్రవ్యలోటు కూడా పెరుగుతుంది
ఈ ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వృద్ధిరేటు సున్నాగా నమోదవుతుందని ప్రముఖ రేటింగ్స్ సంస్ధ మూడీస్ అంచనా వేసింది. కరోనా లాక్ డౌన్ దీనికి కారణమని తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరంలో భారత్ ఎలాంటి ఆర్థిక వృద్ధిరేటును నమోదు చేయనప్పటికీ... వచ్చే ఆర్థిక సంవత్సరంలో మాత్రం వృద్ధిరేటు 6.6 శాతానికి పుంజుకుంటుందని పేర్కొంది. ఈ ఏడాది ద్రవ్యలోటు కూడా పెరుగుతుందని... జీడీపీలో అది 5.5 శాతంగా ఉంటుందని అంచనా వేసింది.
గ్రామీణ కుటుంబాల్లో సుదీర్ఘంగా ఉన్న ఆర్థిక ఒత్తిడి, బలహీనమైన ఉద్యోగ కల్పన, ఆర్థిక సంస్థల్లో నగదు కొరత వంటివి కూడా వృద్ధిరేటు తగ్గడానికి కారణమవుతాయని మూడీస్ తెలిపింది. గత నవంబరులో భారత్ కు మూడీస్ బీఏఏ2 రేటింగ్ ఇచ్చింది. ప్రస్తుతం ఆర్థిక వృద్ధి తగ్గడంతో ఆ రేటింగ్ ను నెగెటివ్ కు సవరించింది.