Jagan: సీఎం జగన్ ఫొటోకు నెల్లూరు జిల్లా మత్స్యకార కుటుంబాల పాలాభిషేకం!
- ‘వైఎస్సార్ మత్స్యకార భరోసా’ ప్రవేశపెట్టడంపై సంతోషం
- ఆర్థిక సాయంతో ఆత్మస్థైర్యం నింపారన్న మత్స్యకారులు
- తుమ్మలపెంట సముద్రతీరంలో ఘటన
వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం ద్వారా తమకు ఆర్థిక సాయం అందించారని, తమ కుటుంబాల్లో ఆత్మ స్థైర్యం నింపారంటూ సీఎం జగన్ పై నెల్లూరు జిల్లా మత్స్యకార కుటుంబాలు ప్రశంసలు కురిపించాయి.
ఈ సందర్భంగా కావలి నియోజకవర్గంలోని తుమ్మలపెంట సముద్రతీరంలో జగన్, స్థానిక ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సముద్రతీరం వద్దే మేజర్ ఫిషింగ్ హార్బర్ నిర్మించేందుకు ముఖ్యమంత్రి చర్యలు చేపట్టారని, అందుకు వారికి రుణపడి ఉంటామని అన్నారు. ఇదిలా ఉండగా, ‘కరోనా’, లాక్ డౌన్ నిబంధనలు అమల్లో ఉన్న సమయంలో వాటిని పట్టించుకోకుండా, జాగ్రత్తలు పాటించకుండా ఈ కార్యక్రమం నిర్వహించడంపై విమర్శలు తలెత్తాయి.