Russia: రష్యా కొంపముంచిన ఆలస్యం.. దేశాన్ని చుట్టేస్తున్న కరోనా వైరస్!

Corona Casese in Russia Raising Rapidly

  • మాస్కోను వీడిన 10 లక్షల మంది
  • లాక్‌డౌన్ విషయంలో నిర్లక్ష్యం
  • కరోనా బారినపడిన ప్రధాని, మంత్రులు

నిన్నమొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న రష్యా ఇప్పుడు కరోనా మహమ్మారి బారినపడి అతలాకుతలం అవుతోంది. వైరస్‌ను కట్టడి చేశామని సంబరపడిన ఆ దేశ ప్రజల ఆనందం అంతలోనే ఆవిరైంది. గత వారం పదిరోజులుగా కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరగడంతో ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. రష్యా ప్రధానమంత్రి మిఖాయిల్‌ మిషూస్టిన్, సాంస్కృతిక మంత్రి ఓల్గా లూంబిమోవాస్, గృహనిర్మాణ మంత్రి వ్లాదిమర్‌ యకుషేవ్‌లును కూడా వైరస్ వదల్లేదు. ప్రస్తుతం వీరంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

కరోనా వైరస్ నియంత్రణ విషయంలో అన్ని దేశాల కంటే ముందే తేరుకున్నప్పటికీ లాక్‌డౌన్ విషయంలో ఆలస్యం చేయడమే ఆ దేశం కొంప ముంచింది. రోజురోజుకు వందల సంఖ్యతో పెరుగుతున్న కేసులతో రష్యా ఇప్పుడు ఐదో స్థానానికి చేరుకుంది. ఈ క్రమంలో జర్మనీ, ఫ్రాన్స్‌లను కూడా దాటేసింది. అధ్యక్షుడు పుతిన్ అధికార కాంక్షే రష్యా ప్రస్తుత దుస్థితికి కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. 2036 వరకు తానే అధ్యక్షుడిగా కొనసాగాలన్న ఆరాటంతో మిగతా విషయాలను గాలికి వదిలేసిన పుతిన్ రాజ్యాంగ సవరణ విషయంలో బిజీగా ఉన్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

దేశ్యాప్తంగా ఇప్పటి వరకు 1,77,160 కరోనా కేసులు నమోదు కాగా, ఇందులో సగానికి పైగా కేసులు ఒక్క రాజధాని మాస్కోలోనే నమోదు కావడం గమనార్హం. 1625 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో భయపడుతున్న ప్రజలు మాస్కోను వీడుతున్నారు. ఇప్పటి వరకు 10 లక్షల మందికిపైగా రాజధానిని వీడారు. దేశ జీడీపీ కూడా ఐదు శాతానికి పడిపోయింది.

  • Loading...

More Telugu News