NLC: తమిళనాడు ఎన్నెల్సీ ప్లాంట్ లో పేలిన బాయిలర్... ఏడుగురికి తీవ్ర గాయాలు

Boiler explosion in Neyveli Lignite Corporation
  • అధిక ఒత్తిడికి గురైన బాయిలర్
  • షార్ట్ సర్క్యూట్ తో ప్రమాదం
  • దేశంలో ఇవాళ మూడో దుర్ఘటన
ఇప్పటికే విశాఖ గ్యాస్ లీక్ ఘటన, చత్తీస్ గఢ్ ఉదంతం దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతి కలిగిస్తుండగా, తమిళనాడులోని ప్రఖ్యాత నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ (ఎన్నెల్సీ)లో భారీ విస్ఫోటనం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా అధిక వేడిమి వెలువడడంతో ఒత్తిడికి గురై బాయిలర్ పేలినట్టుగా భావిస్తున్నారు. ఈ ఘటనలో ఏడుగురు తీవ్రగాయాలపాలయ్యారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఘటన జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటీన ఎన్నెల్సీ ప్లాంట్ కు తరలివెళ్లారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
NLC
Boiler
Explosion

More Telugu News