Samantha: సమంత రూటే సెపరేటు.. లాక్ డౌన్ సమయంలో ఏం చేస్తోందంటే..!

Actress Samantha joins in online acting class
  • ఆన్ లైన్ కోర్సులో చేరిన సమంత
  • నటనలో మెళకువలు నేర్చుకుంటున్నానన్న శామ్
  • లాక్ డౌన్ పూర్తయ్యేలోపల మంచి యాక్టర్ అవుతానని వ్యాఖ్య
వైవిధ్యభరితమైన పాత్రలను పోషిస్తూ ఇప్పటికే ఒక మంచి నటిగా అక్కినేని సమంత రుజువు చేసుకుంది. నాగచైతన్యను పెళ్లి చేసుకున్న తర్వాత పాత్రలను ఎంచుకోవడంలో ఆమె మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. మరోవైపు లాక్ డౌన్ నేపథ్యంలో సినీ సెలబ్రిటీలంతా ఇంటి వద్దే గడుపుతున్నారు. ఇంటిని శుభ్రం చేయడం, అంట్లు తోమడం, వంట చేయడం వంటి పనులు చేస్తూ ఖాళీ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. అంతేకాదు, వాటికి సంబంధించిన వీడియోలను పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. సమంత మాత్రం వీరందరికీ డిఫరెంట్ గా తన లాక్ డౌన్ పీరియడ్ ను గడుపుతోంది.

సమంత ప్రస్తుతం ఒక ఆన్ లైన్ క్లాసులో జాయిన్ అయింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఆమె తెలిపింది. నటనలో మెళకువలు నేర్చుకుంటున్నానని చెప్పింది. లాక్ డౌన్ పూర్తయ్యేలోగా మంచి యాక్టర్ అవుతానని అనుకుంటున్నానని... ఒకవేళ కాకపోతే ఈ పోస్ట్ ను డిలీట్ చేస్తానని తెలిపింది.
Samantha
Online Course
Acting
Tollywood

More Telugu News