Hyper Aadi: నన్ను చూడగానే చిరంజీవిగారు కారు దిగి మరీ వచ్చారు: హైపర్ ఆది

Hyper Aadi

  • చిరంజీవి గారిని దగ్గరగా చూశాను
  •  ఆయన చూపిన అభిమానం మరువలేనిది
  • టీవీ రంగాన్ని ఎప్పటికీ వదిలేయనన్న ఆది

'జబర్దస్త్' కామెడీ షో ద్వారా పాప్యులర్ అయిన కమెడియన్స్ లో హైపర్ ఆది ఒకరుగా కనిపిస్తాడు. ఈ షో ద్వారా వచ్చిన క్రేజ్ తో ఆయన సినిమాల్లోను బిజీ అయ్యాడు. ఇక రచయితగాను కొన్ని సినిమాలకు పనిచేస్తున్నాడు. అయితే పూర్తి స్థాయిలో సినిమా మొత్తం స్క్రిప్ట్ ను రాయడమే తన ఆశయమని తాజా ఇంటర్వ్యూలో ఆయన చెప్పాడు. అంతేకాకుండా తన జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని సంఘటన ఒకటి జరిగిందంటూ దానిని గురించి చెప్పుకొచ్చాడు.

'జబర్దస్త్' చేస్తున్న సమయంలోనే  ఒకసారి నేను అన్నపూర్ణ స్టూడియోకి వెళ్లాను. అక్కడ  చిరంజీవిగారు తన షూటింగును పూర్తి చేసి బయలుదేరుతున్నారు. ఆయనను దగ్గరగా చూడాలనే ఉద్దేశంతో ఓ సాధారణమైన అభిమానిగానే నేను ఆయన కారుకు దగ్గరగా నిలబడ్డాను. కార్లో కూర్చున్న తరువాత ఆయన నన్ను చూశారు. నన్ను చూసిన వెంటనే కారు దిగేసి వచ్చి ఆత్మీయంగా దగ్గరికి తీసుకున్నారు. 'మీ స్కిట్లు చూస్తుంటాను .. చాలా బాగుంటాయి .. మీ పంచ్ లు బాగా నవ్విస్తాయి' అంటూ ఆయన నా పనితీరును ప్రశంసించారు.  అంతటి గొప్ప నటుడు అంతలా నాతో మాట్లాడడం నా జీవితంలో నేను ఎప్పటికీ మరిచిపోలేని సంఘటనగా భావిస్తుంటాను. నాకు ఇంతటి గుర్తింపును తీసుకొచ్చిన టీవీ రంగాన్ని నేను ఎప్పటికీ వదిలేయను ' అని చెప్పుకొచ్చాడు.

  • Loading...

More Telugu News