Jaggareddy: ఆ లక్షణమే కేసీఆర్ పతనానికి దారి తీస్తుంది: జగ్గారెడ్డి

Jaggareddy fires on KCR

  • రైతు దీక్షను చూసి తట్టుకోలేకపోతున్నారు
  • తెలంగాణ తెచ్చిన కాంగ్రెస్ నేతలు బఫూన్లు అయ్యారా?
  • తిన్నింటి వాసాలు లెక్కపెట్టే వ్యక్తి కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కు అహంకారం ఎక్కువైందని అన్నారు. రైతు దీక్షను చూసి తట్టుకోలేక నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రత్యేక తెలంగాణను కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం వల్లే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారని చెప్పారు.

సోనియాగాంధీని ఒప్పించి, తెలంగాణను తెచ్చిన కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ కు బఫూన్లు అయ్యారా? అని ప్రశ్నించారు. తిన్నింటి వాసాలు లెక్కపెట్టే వ్యక్తి కేసీఆర్ అని దుయ్యబట్టారు. రైతు సమస్యలపై నిలదీస్తే... చిల్లరగాళ్లు అయ్యారా? అని మండిపడ్డారు. అహంకారమే కేసీఆర్ పతనానికి దారి తీస్తుందని చెప్పారు.

Jaggareddy
Congress
KCR
TRS
  • Loading...

More Telugu News