Ruhani Sharma: తెలుగు నేర్చుకుంటున్న హీరోయిన్ రుహానీ శర్మ!

Ruhani Sharma

  • 'హిట్' సినిమాతో మంచి గుర్తింపు
  • చేతిలో మూడు సినిమాలు
  • అవకాశాలు పెరుగుతాయనే ఆశతో రుహాని    

తెలుగు తెరకి ఈ మధ్య కాలంలో పరిచయమైన కథానాయికలలో రుహానీ శర్మ ఒకరు. ఇటీవల కాలంలో ఆమె చేసిన 'హిట్' సినిమా మంచి గుర్తింపు తీసుకొచ్చింది. దాంతో ఆమెకి వరుస అవకాశాలు వచ్చి పడుతున్నాయి. ఈ  నేపథ్యంలోనే ఆమె 'మోసగాళ్లు' .. ' డర్టీ హరీ' సినిమాలను చేస్తోంది. అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఒక సినిమాలోను ఆమె నటిస్తోంది.

ఈ మూడు సినిమాలు ఒకదాని తరువాత ఒకటిగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ సినిమాలు తనకి మరిన్ని అవకాశాలు తెచ్చిపెడతాయని భావించిన రహానీ శర్మ, తెలుగు భాష నేర్చుకోవడంపై దృష్టి పెట్టిందట. భాష వచ్చి వుంటే భావాలను సరిగ్గా పలికించడానికి అవకాశం ఉంటుందని భావించిన రుహానీ, తెలుగు నేర్చుకోవడానికి రోజుకి రెండు గంటల సమయాన్ని కేటాయిస్తుందట.

ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఇంటిపట్టునే వున్న రుహానీ, లాక్ డౌన్ పూర్తయ్యేలోగా తెలుగును నేర్చుకోవాలనే పట్టుదలతో గట్టిగానే కసరత్తు చేస్తోందట. తెలుగు భాష నేర్చుకున్న తరువాత, ఈ సుందరి తన పాత్రకి తానే డబ్బింగ్ చెబుతుందేమో చూడాలి.

Ruhani Sharma
Actress
Tollywood
  • Loading...

More Telugu News